Site icon PRASHNA AYUDHAM

గాంధారిలో ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ఎరువుల నిల్వలపై పరిశీలన

IMG 20251025 205856

🔹 గాంధారిలో ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ఎరువుల నిల్వలపై పరిశీలన 🔹

గాంధారి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అధికారులు తనిఖీ

సర్వాపూర్, మాత్ సంఘం సెంటర్లలో తూకం, తేమ శాతం వంటి అంశాల పరిశీలన

రైతులకు ఎరువులు సమయానికి అందించాలంటూ ఫర్టిలైజర్ ఔట్‌లెట్లలో యూరియా నిల్వల పరిశీలన

కేంద్రాలు పారదర్శకంగా, సమర్థవంతంగా పనిచేయాలంటూ సూచనలు

వ్యవసాయ శాఖ అధికారి రాజలింగం తనిఖీల్లో పాల్గొన్నారు

గాంధారి, అక్టోబర్ 25 (ప్రశ్న ఆయుధం):

గాంధారి మండల కేంద్రంలో అధికారుల బృందం ప్రొక్యూర్మెంట్ సెంటర్లను పరిశీలించింది. సర్వాపూర్, మాత్ సంఘం సెంటర్లలో ధాన్యం నిల్వలు, బస్తాల తూకం, తేమ శాతం వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించారు. రైతులకు ఎరువులు సకాలంలో అందేలా ఫర్టిలైజర్ ఔట్‌లెట్లలో యూరియా నిల్వలను కూడా పరిశీలించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి రాజలింగం మాట్లాడుతూ, కేంద్రాలు మరియు ఔట్‌లెట్లు పారదర్శకంగా, సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన సూచించారు.

Exit mobile version