Site icon PRASHNA AYUDHAM

నెలలు గడుస్తున్నా కమిషన్ కి నోచుకోని రేషన్ డీలర్లు

IMG 20250219 WA0065

నెలలు గడుస్తున్నా కమిషన్ కి నోచుకోని రేషన్ డీలర్లు.

కామారెడ్డి  ఫిబ్రవరి 19.

ఫిబ్రవరి నెల

ముగుస్తున్నప్పటికి రేషన్ డీలర్లు తాము పంపిణీ చేసినటువంటి డిసెంబర్ మాసం యొక్క కమిషన్ ఇంతవరకు పొందలేదు. గత పది సంవత్సరాల నుండి ప్రత్యామ్నాయ సరుకులు లేక కేవలం ఒక బియ్యం పైననే వచ్చే కమిషన్ పైన ఆధారపడిన రేషన్ డీలర్ల కుటుంబాలు అడుగడుగునా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.. డిసెంబర్ నెలలో పంపిణీ చేసినటువంటి రేషన్ బియ్యం యొక్క మిషన్ కోసం ఫిబ్రవరి మాసం చివరి వరకు ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఉన్నది.. అసలే అంతంత మాత్రం కమిషన్తో ఇటు దుకాణంలో హామాలిని, మరియు దుకాణం యొక్క అద్దెని అలాగే కుటుంబపోషణ చూసుకోవడం అనేది రేషన్ డీలర్లకు భారంగా మారింది.

Exit mobile version