జిల్లా మానవ హక్కుల సహాయక సంగం అధ్యక్షుడిగా మోసర్ల శ్రీకాంత్ రెడ్డి
కామారెడ్డి జిల్లా మానవ హక్కుల సహాయక సంగం జిల్లా అధ్యక్షుడిగా మోసర్ల శ్రీకాంత్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్, కామారెడ్డి మాజి ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి సలీం ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన మోసర్ల శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ప్రజల హక్కుల కొరకు నిరంతరం పాటుపడతానని తెలిపారు.