మాస్టర్ ప్లాన్ జీవో రద్దు చేయకుంటే మళ్లీ ఉద్యమిస్తాం : మోసర్ల శ్రీకాంత్ రెడ్డి,
రైతు జేఏసీ నాయకులు: మాస్టర్ ప్లాన్ రద్దు చేయకుంటే మళ్ళీ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొస్తామని రైతు జేఏసీ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులపై పెట్టిన కేసులు నేటికీ ఎత్తివేయకుండా ప్రభుత్వం కాలక్షేపం గడుపుతుందన్నారు.ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ జీవో రద్దు పై పునరాలోచన చేయాలన్నారు. కొంతమంది రైతులను రాజకీయానికి వాడుకొని కాలక్షేపం గడుపుతున్నారన్నారు.మాస్టర్ ప్లాన్ జీవో రద్దు పై ఎమ్మెల్యేలు స్పందించాలన్నారు.మాస్టర్ ప్లాన్ జీవో తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని,గత ప్రభుత్వం తరహాలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తే రెండు ప్రభుత్వాలకు తేడా ఉండదు అన్నారు.ప్రభుత్వ సిఎస్ నుండి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు జీవో జారీ చేయాలన్నారు.లేనియెడల మాస్టర్ ప్లాన్ ఉద్యమాన్ని మళ్లీ తెరపైకి తీసుకొస్తామన్నారు.