Headlines :
-
అడవి రామవరం గ్రామ ఆదివాసీలకు దోమ తెరలు పంపిణీ
-
గుండాల సీఐ రవీందర్ ఆధ్వర్యంలో దోమ తెరలు పంపిణీ కార్యక్రమం
-
పేదల కోసం ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవా కార్యక్రమం
గుండాల సీఐ రవీందర్
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేద్దాం ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అమూల్యమైనవి అన్నారు.
గుండాల సీఐ రవీందర్ ఆదివారం ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’సభ్యులు,కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా సహకారం తో గుండాల పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిరామరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ ముఖ్య అతిధిగా పాల్గొని గ్రామస్తులతో పాటు వలస ఆదివాసీలకు చెందిన సుమారు 50 కుటుంబాలకు దోమ తెరలు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రస్తుత రోజుల్లో ఆపదలో ఉన్న పేదలకు ఆసరాగ నిలబడే వ్యక్తులు అవసరమని అన్నారు.అంతేకాకుండా ప్రతీ ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని అభిప్రాయపడ్డారు.అదేవిధంగా దోమ తెరలను విధిగా వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.ఆరోగ్యంగ ఉండడమే నేటి రోజుల్లో చాలా ముఖ్యమని న్నారు.గ్రామ ప్రజలు ఎవరు అసం ఘిక శక్తులకు సహకరించ వద్దని తెలిపారు.ఏ సమస్య అయిన పోలీస్ శాఖ కు సమాచారం అందిస్తే ఆ సమస్య సాల్వ అయ్యే విధంగా ప్రయత్నిస్తామని తెలిపారు.అనంతరం ఫౌండేషన్ సభ్యులు సోందుపాషా మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి రానున్న రోజుల్లో పేదలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.సేవా కార్యక్రమాలను ఈ మండలంలో కూడా విస్తృతంగా చేపడుతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు షేక్ వసీం అక్రం,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.