Site icon PRASHNA AYUDHAM

స్వచ్ఛంద సంస్థల సేవలు ప్రభుత్వ పాఠశాలలకు అవసరం

పాఠశాలలకు
Headlines
  1. శశిధర్ రెడ్డి ఫౌండేషన్ సేవలు: మోటకొండూరు జెడ్పీ పాఠశాల అభివృద్ధికి ఆర్థిక సహాయం
  2. స్వచ్ఛంద సంస్థలతో పాఠశాల అభివృద్ధి: విద్యాధికారుల సూచనలు
  3. విద్యార్థుల విద్యా ప్రతిభకు చేయూత: శశిధర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఫౌండేషన్ చే సహాయం
  4. మోటకొండూరు పాఠశాలలో కవితలు, పాటలతో విద్యార్థులకు ప్రోత్సాహం
  5. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం లక్ష్యంగా శశిధర్ రెడ్డి ఫౌండేషన్ సేవలు
స్వచ్ఛంద సంస్థల సేవలు ప్రభుత్వ పాఠశాలలకు అవసరం అని మోటకొండూరు మండల విద్యా అధికారి కేతిరెడ్డి రఘురాం రెడ్డి అన్నారు. శశిధర్ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ కంది చంద్రకళ వెంకట్ రాం రెడ్డి ప్రథమ పుత్రుడు కంది శశిధర్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా మోటకొండూరు మండల కేంద్రంలో జెడ్పీ హెచ్ ఎస్ పాఠశాలకు వారి కుమారుడి జ్ఞాపకార్ధంగా పాఠశాల అభివృద్ది కోసం 10,000 (పదివేల) రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల విద్యా అధికారి ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతిరెడ్డీ రఘురాం రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలలకు ఫౌండేశన్,స్వచ్ఛంధ సంస్థల సేవలు అవసరం అని అన్నారు.ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలకు ఆర్ధిక సహాయం అందివ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మీలాంటి ఫౌండేషన్ వారి సహకారం వల్ల ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థులకు మేలు జరుగుతుందనీ అన్నారు.మండల వ్యాప్తంగా మి ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాలకు మా సహకారం ఉంటుదని అన్నారు.మరో ముఖ్య అతిధి పాల్గొన్న కవి గాయకులు చేయుత ఫౌండేషన్ చైర్మన్ వాకిటి రాం రెడ్డి మాట్లాడుతూ మోటకొండూరు ప్రభుత్వ పాఠశాలలో 250 మందికి పైగా విద్యార్థులు ఉండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.విద్యార్థులకు చదువు,క్రమ శిక్షణ,తెలుగు భాషపై వివరించారు.తమ కవిత్వంతో ,పాఠశాల విద్యార్థులను,ఉపాధ్యాయ బృందాన్ని పాటలు గా మలిచి అందరినీ అలరించారు.కి శే కంది శశిధర్ రెడ్డిపై తాము స్వయంగా రచించి పాడిన పాటను మైక్ ద్వారా వినిపించారు.పదవతరగతి పరీక్షల్లో అందరు 10/10 తెచ్చుకోవాలని అన్నారు.వంద శాతం ఉత్తీర్ణత పాఠశాలలు రావాలని సూచించారు.పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు చేయూత, శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో బహుమతులు, ఫ్రైజ్ మనీలు,అందజేస్తామని తెలిపారు.శశిధర్ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ కంది చంద్రకళ వెంకట్ రాం రెడ్డి మాట్లాడుతూ మా కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలో చూసుకుంటున్నాం అన్నారు.ప్రభుత్వ పాఠశాల బలోపితం లక్ష్యంగా మా ఫౌండేషన్ పని చేస్తుందని అన్నారు.కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు తెలుగు భాష గురించి చక్కని పాట పాడారు,విద్యార్ధులు ఇంగ్లీష్ లో అద్భుతంగా మాట్లాడి,తెలుగులో కవిత్వాలు పాడి శశిధర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించి కార్యక్రమం ముగించారు.ఈ కార్యక్రమంలో మోటకొండూరు జెడ్పీహెచ్ ఎస్ పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
Exit mobile version