మోతే–గుర్జాల్ రహదారి లోలెవెల్ కాజ్ వే దెబ్బతింది
— తాత్కాలిక మరమ్మతులతో వాహన రాకపోకలు ప్రారంభం
— శాశ్వత పునరుద్ధరణకు ప్రణాళికలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 16
యెల్లారెడ్డి నియోజకవర్గంలోని మోతే–గుర్జాల్ (ఆర్‌అండ్‌బీ) రహదారిలో వoడ్రికల్ గ్రామం వద్ద ఉన్న లోలెవెల్ కాజ్‌వే ఇటీవలి వర్షాల కారణంగా దెబ్బతింది. తాత్కాలికంగా రహదారి మీద గ్రావెల్ వేసి రూ.60 వేల వ్యయంతో పునరుద్ధరించడంతో వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.
మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఘటనాస్థలాన్ని పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. మోహన్‌కు ఆదేశాలు జారీ చేశారు.
శాశ్వత పునరుద్ధరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అందులో భాగంగా సైడ్‌వాల్ నిర్మాణం, అదనపు పైపులు ఏర్పాటు చేయనున్నట్లు EE పి. మోహన్ తెలిపారు. దీనికి రూ.6 లక్షల అంచనా వ్యయం ఉండనున్నట్లు ఆయన పేర్కొన్నారు.