Site icon PRASHNA AYUDHAM

తల్లి, కుమారుడు.. క్లాస్‌మేట్స్‌!

క్లాస్‌మేట్స్‌
Headlines in Telugu:
  1. “తల్లి, కుమారుడు కలిసి క్లాస్‌మేట్స్: స్వర్ణలత ప్రతిభ”
  2. “38 ఏళ్ల స్వర్ణలత ఐటీఐ కోర్సులో చేరి, తనయుడిని ప్రేరేపించడం”
  3. “పెద్దపల్లి: తల్లి, కుమారుడు విద్యాభ్యాసంలో జతగా ప్రయాణం”
  4. “స్ఫూర్తిదాయక ఉదంతం: స్వర్ణలత తల్లి పాత్రను ఓ కొత్త ఆవిష్కరణగా”
  5. “వయోపరిమితి దాటి విద్యాబ్యాసం: స్వర్ణలత, రోషన్ ప్రయాణం”

తరగతి గదిలో రోషన్, అతడి తల్లి స్వర్ణలత (వృత్తాల్లో)

ఈ చిత్రంలో కనిపిస్తున్న తల్లి, కుమారుడు క్లాస్‌మేట్స్‌. ఉజ్వల భవిష్యత్తు కోసం కుమారుడిని డిప్లొమా కోర్సులో చేర్చిన తల్లి తానూ ఎందుకు నేర్చుకోకూడదని ఆలోచించారు..

ఇంకేముంది.. ప్రవేశం తీసుకుని తనయుడితో కలిసి తరగతులకు హాజరవుతున్నారు. స్ఫూర్తిదాయకమైన ఈ ఉదంతానికి పెద్దపల్లి (peddapalli) జిల్లా కమాన్‌పూర్‌ మండలం గుండారం గ్రామం వేదికైంది. 38 ఏళ్ల జక్కుల స్వర్ణలతకు ఇంటర్మీడియెట్‌ చదివే సమయంలో పెళ్లయింది. కూలి పని చేసే భర్త లక్ష్మణ్‌ ప్రోత్సాహంతో ఆమె దూరవిద్యలో డిగ్రీ, పీజీ చదివారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రోషన్‌ను ఐటీఐలో ఏడాది కాలపరిమితి కలిగిన కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ కోర్సులో చేర్చాలని నిర్ణయించారు. ఈ కోర్సు అభ్యసించేందుకు వయోపరిమితి 45 సంవత్సరాల వరకు ఉండటంతో సెప్టెంబరులో నిర్వహించిన స్పాట్‌ అడ్మిషన్‌లో కుమారుడితో కలిసి ఆమె సైతం ఐటీఐలో చేరారు. ఇద్దరూ కలిసి రోజూ 15 కి.మీ. దూరంలోని పెద్దపల్లి ఐటీఐలో తరగతులకు హాజరవుతున్నారు. తాను నేర్చుకోవడంతో పాటు కుమారుడిని ప్రోత్సహించేందుకు ఈ కోర్సులో చేరినట్లు స్వర్ణలత తెలిపారు.

Exit mobile version