• మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలి
•సిడిపిఓ హేమా భార్గవి
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 23 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
అంగన్వాడి టీచర్లు ప్రతిరోజు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఐసిడిఎస్ నర్సాపూర్ ప్రాజెక్ట్ సిడిపిఓ హేమ భార్గవి తెలిపారు. సోమవారం శివ్వంపేట రైతు వేదికలో నర్సాపూర్ ప్రాజెక్టు పరిధిలోని ఆరు మండలాల అంగన్వాడి టీచర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లు సమయపాలన పాటించి, పిల్లలకు ఆటపాటల ద్వారా విద్యా బోధన చేయాలన్నారు. గర్భిణీలు బాలింతలు చిన్నారులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. పిల్లలు, తల్లుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అంగన్వాడి విడుదలకు సంబంధించి ఆన్లైన్ త్వరగా పూర్తి చేయాలన్నారు. అంగన్వాడి కేంద్రంతో పాటు పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వీధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ప్రాజెక్ట్ సూపర్వైజర్స్ మరియు జిల్లా కోషన్ అభియాన్ కోఆర్డినేటర్ మరియు అంగన్వాడి టీచర్స్ పాల్గొన్నారు.