అరుణాచలంలో హత్యకు గురైన మోత్కూరు యువకుడు

• అరుణాచలంలో హత్యకు

గురైన మోత్కూరు యువకుడు

అరుణాచలంలో దైవ దర్శనానికి వెళ్లి అక్కడ దొంగల చేతిలో హతమైన సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పట్టణం లోని ఇందిరా నగర్ కు చెందిన చిప్పలపల్లి రవీందర్ ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా అసెంబ్లీ ప్రాంగణం లో విధులు నిర్వహిస్తూ హైదరాబాద్ లో ఉంటున్నాడు.అతని కుమారుడు విద్యాసాగర్ (28) మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తూ కంపెనీ క్వార్టర్స్ లో ఉంటున్నాడు.విద్యాసాగర్ గతం లో రెండు సార్లు స్నేహితులతో కలిసి అరుణాచలం వెళ్లి వచ్చాడు.ఈ సారి కూడా వెల్దామంటే స్నేహితులు రామని చెప్పడంతో అతడు

ఒక్కడే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.             

ఈ నెల 4న మోత్కూరు వచ్చి తాతను చూసి వెళ్లాడు. ఈ నెల 6న బయలుదేరి వెళ్లి 7న అరుణాచలం చేరుకున్నాడు. పగలు గిరిప్రదక్షణ చేస్తే ఎండకు కాళ్లు కాలుతాయని ఈ నెల 8న రాత్రి గిరిప్రదక్షణ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసి గొంతు కోశారని, రాత్రంతా కొన ఊపిరితో కొట్టుకుంటూ రోడ్డుపైనే పడి ఉన్నాడని, 9న ఉదయం అక్కడి పోలీసులు చూసి ఆస్పత్రికి తరలించారని చెబుతున్నారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో 9న వారు వెళ్లే సరికి విద్యాసాగర్ ఆస్పపత్రిలో మృతి చెంది ఉన్నాడు. ఈ నెల 10న పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు భౌతికకాయాన్ని తలిదండ్రులకు అప్పగించగా స్వగ్రామానికి తీసుకవచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.     

రవీందర్ కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉండగా ఇద్దరు కుమార్తెల వివాహాలు జరిగాయి. కుమారుడు కూడా ప్రయోజకుడై ఉద్యోగం చేస్తుండటంతో త్వరలోనే వివాహం చేయాలనుకున్నారు.ఇంతలోనే దొంగల చేతిలో మృతి చెందడంతో తల్లిదండ్రులు, తోబుట్టువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.విద్యాసాగర్

మృతితో ఇందిరానగర్ కాలనీలో విషాదఛాయలు

అములుకున్నాయి.

 

Join WhatsApp

Join Now