ప్రశ్న ఆయుధం డిసెంబర్ 27 భద్రాద్రి కొత్తగూడెం సుజాతనగర్ మండల ప్రతినిధి
సుజాతనగర్ మండల కేంద్రంలో జాతీయ రహదారి మెయిన్ రోడ్డు సుజాతనగర్ సెంటర్ ప్రధాన కూడలికి అడ్డుగా భారీ కేడ్లు ఉండటంతో వాహనదారులు అలాగే ప్రజలు చిన్నపిల్లలు మహిళలు ముసలివారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని. ప్రజలు అక్కడక్కడ మాట్లాడుకుంటున్నారు మండల కేంద్రం ఏర్పాటు జరిగిన తరువాత ప్రజలు వారి వారి పనుల నిమిత్తం వస్తు వెళ్తూ ఉంటున్నారు కొంత రద్దీ పెరిగింది కానీ ప్రధాన కూడలి కావడంతో సింగభూపాలెం నుంచి వచ్చేవారు వెళ్లేవారు అలాగే సుజాతనగర్ నుంచి వచ్చేవారు వెళ్లేవారు మండల కార్యాలయాలకు వచ్చేవారు మండలంలోని ప్రతి గ్రామపంచాయతీ నుండి ప్రజలు అలాగే విద్యార్థులు ఉద్యోగులు ప్రతి ఒక్కరు వస్తూనే ఉంటున్నారు సింగభూపాలెం వెళ్లే దారిలో ప్రక్కనే ప్రభుత్వ వైద్యశాలకు వచ్చేవారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సమస్య ఎదుర్కొంటున్నారు. అని అసలు ప్రధాన కూడలి మూసివేయడం ఏమిటని కొంతమంది ప్రజలు ఒకచోట చేరినప్పుడల్లా చర్చించుకుంటున్నట్లు సమాచారం ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే వాహనదారుడు కూడలి దాటే క్రమంలో ఒక్కసారి చూసుకొని వెళ్లేవారు కానీ ఇప్పుడు ఒక వాహనం మలుపు మలుపులు తిరుగుకుంటూ వచ్చే పోయే వారి వాహనాలతో ఎదురుగా వస్తున్న వాహనాలకు భయపడుతూ వెళ్లవలసిన పరిస్థితి పెద్ద వాహనాలు యూటర్న్ తీసుకోలేక అవస్థలు పడుతున్నాయని ప్రజలు అంటున్నారు. ప్రధాన కూడలికి అడ్డుగా ఉన్న భారీ కేడ్లు తొలగించి ప్రధాన కూడలి సమస్య లేకుండా చేయాలని సుజాతనగర్ మండల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఆయా సంబంధిత అధికారులు గానీ ప్రజా ప్రతినిధులు గాని ప్రధాన కూడలి సమస్యను గుర్తించి పరిష్కరిస్తారని విద్యావంతులు మేధావులు ప్రజాసంఘాలు నాయకులు ప్రజలు కోరుతున్నారు.