వాహనదారులు హెల్మెంట్ తప్పుక ధరించాలి
హుజూర్ నగర్ ఎస్ ఐ ముత్తయ్య
సూర్యాపేట జనవరి 17
వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హుజూర్ నగర్ ఎస్ఐ ముత్తయ్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఇందిరా సెంటర్లో ద్విచక్ర వాహనదారులకు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పించారు. వాహనదారులు విధిగా నిబంధనలు పాటించాలని లేనిచో జరిమానాలు విధిస్తామన్నారు. వాహనదారులు ప్రయాణంలో హెల్మెట్ ధరించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడచ్చని వివరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు