సోనూసూద్ మంచి మనసు చిన్నారికి ఉచితంగా హార్ట్ ఆపరేషన్..
హైదరాబాద్ డేస్క్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 21:
సినీ నటుడు సోనూసూద్ మరోసారి మంచి మనసు .
చాటుకున్నారు. ఖమ్మం(D) చెన్నూరుకి చెందిన నిరుపేదలు కృష్ణ, బిందుప్రియల మూడేళ్ల కూతురికి ఉచితంగా ముంబైలో హార్ట్ ఆపరేషన్ చేయించారు. చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారుబాలికకు చిన్నప్పటి నుంచే గుండె సమస్య ఉంది.
ఆపరేషన్కు 6 లక్షలపైగా ఖర్చవుతుందని స్థానిక వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు.