Site icon PRASHNA AYUDHAM

దేశ రక్షణలో సైనికుల పాత్ర గొప్పది..!!

సైనికుల
Headlines:
  1. “దేశ రక్షణలో సైనికుల గౌరవ స్థానం – ఎంపీ రఘునందన్ రావు”
  2. “యువత సైనికత వైపు రావాలని పిలుపునిచ్చిన ఎంపీ రఘునందన్”
  3. “ఆజాద్ డిఫెన్స్ అకాడమీ కార్యాలయ ప్రారంభంలో ఎంపీ రఘునందన్ ప్రసంగం”

మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు

గజ్వేల్ అక్టోబర్ 27 ప్రశ్న ఆయుధం :

దేశ రక్షణలో సైనికుల పాత్ర గొప్పదని మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ రోడ్డు లో దొంతుల ప్రసాద్ గార్డెన్ వద్ద ఆజాద్ డిఫెన్స్ అకాడమీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎంపీ రఘు నందన్ రావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ గ్రామీణ యువతను ప్రోత్సాహం అందిస్తున్న ఆజాద్ అకాడమీ చైర్మన్ నీల చంద్రం, సభ్యులను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం యువత ముందుకు రావాలన్నారు. యువత దేశాన్ని కాపాడడానికి ఆర్మీ, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ పంపించాలంటే కుటుంబ సభ్యులు భయపడుతున్నారని,తల్లిదండ్రులు భయపడకుండా యువత ఆర్మీలో చేర్పించాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణే ప్రథమ కర్తవ్యంగా భావించే సైనికులతో మనమంతా సురక్షితంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ నీల చంద్రం మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావు ఇచ్చిన ధైర్యంతో ఈ అకాడమీ నెలకొల్పానన్నారు. నేను ఆర్మీ లో పని చేసినప్పుడు ఆయన వ్యాఖ్యలు తనకి ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. ఈ అకాడమీ నుండి ఇప్పటి వరకు 35 మంది యువత ను సైనికులుగా పంపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా మాజీ సైనిక సంఘం అధ్యక్షులు సురేందర్ రెడ్డి, బిజెపి మెదక్ జిల్లా జోనల్ ఇంచార్జ్ నలగామ శ్రీనివాస్, బిజెపి నేతలు ఎల్లురామిరెడ్డి, పూదారి నందన్ గౌడ్, దారం గురువారెడ్డి, కమ్మరి శ్రీనివాస్, విభూషణ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, బిజెపి పట్టణ శాఖ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version