పవిత్రను సన్మానించిన ఎంపీ రఘునందన్ రావు 

పవిత్రను సన్మానించిన ఎంపీ రఘునందన్ రావు

*గజ్వేల్ నియోజకవర్గం ప్రతినిధి, డిసెంబర్ 26, ప్రశ్న ఆయుధం

జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని పవిత్రకు మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గురువారం గజ్వేల్ పట్టణంలో సన్మానం చేశారు. ఉత్తరప్రదేశ్ లో డిసెంబర్ 10 నుంచి నిర్వహించే ఎస్జిఎఫ్ అండర్-14 జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆర్అండ్ఆర్ కాలనీ ఏటిగడ్డ కిష్టాపూర్ కు చెందిన విద్యార్థిని పవిత్ర ఎంపికైంది. ఈ సందర్బంగా మెదక్ ఎంపీ పవిత్రను అభినందించి సన్మానించారు. జాతీయస్థాయిలో మరింతగా రాణించి జాతీయ స్థాయిలో గజ్వేల్ పేరును నిలబెట్టాలని సూచించారు.

Join WhatsApp

Join Now