Site icon PRASHNA AYUDHAM

బొల్లారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు

*బొల్లారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు*

 *ఎంపీ ని సన్మానించిన బొల్లారం బీజేపీ కమిటీ* 

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ ఎం.పీ రఘునందన్ రావుని బొల్లారం మున్సిపల్ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను సభ్యులు ప్రస్తావించారు. వాటిలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎం.పీ రఘునందన్ రావు మాట్లాడుతూ.కేంద్రం నుంచి అందుతున్న నిధులపై ఆరా తీశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చేలా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ బీజేపీ కమిటీ సభ్యులు కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version