రేపు అశ్వారావుపేట నియోజకవర్గం లో ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన

IMG 20240828 WA3089

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి

ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తో కలిసి చండ్రుగొండ మండలంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు అశ్వారావుపేటలో చెక్కులను అందజేస్తారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులతో లబ్ధి చేకూర్చనున్నారు. ఆ తర్వాత ఎంపీ రఘురాం రెడ్డి ఖమ్మంలోని తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులకు అందుబాటులో ఉంటారు.

Join WhatsApp

Join Now