
ధన్యవాదాలు తెలిపిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
కొత్తగూడెం ( ) ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శుక్రవారం పర్యటన విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, పార్టీ అభిమానులకు టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం ఎంపి పర్యటనలో భాగంగా సుజాతనగర్ మండలంలోని సర్వారం, సింగభూపాలెం, రాఘవపురం, సుజాతనగర్లలో పర్యటించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్బంగా వివిధ పార్టీల నుండి 50 కుటుంబాల వారు కాంగ్రెస్ లో చేరగా వారికీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. కొత్తగూడెంలోని మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో రామవరం,గౌతమ్ నగర్, కూలీలైన్,న్యూ గొల్లగూడెం లలో 16, 17, 18, 19, 20, 24వ వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో తన గెలుపుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో మాజీ జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని, ఆళ్ల మురళి, సుజాతనగర్ కాంగ్రెస్ అధ్యక్షులు చింతపూడి రాజశేఖర్, సొసైటీ చైర్మన్ మండె. హనుమంతరావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దేవిప్రసన్న, జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు ఎండి కరీం పాషా, మాజీ ఎంపీటీసీ కసనబోయిన భద్రం, విజయాబాయి, కొప్పుల చంద్రశేఖర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య రాంబాబు, ఆకునూరి కనకరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.