ఎంపీ వద్దిరాజు పెళ్లి కూతురుకు ఆశీస్సులు, పట్టు వస్త్రాలు బహుకరణ.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పెళ్లి కూతురు శ్రీకవితకు పట్టు చీర బహుకరించి తన ఆశీస్సులు అందజేశారు.ఖమ్మంకు చెందిన ప్రముఖ విద్యావేత్త పారుపల్లి ఉషాకిరణ్ కుమార్-విజయలక్మీల ఏకైక కూతురు శ్రీకవిత పెళ్లి ఎర్రా ఉమానాథ్-మాధురిల కుమారుడు మహనిష్ తో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులోని అన్వయ కన్వెన్షన్ హాలులో బుధవారం రాత్రి జరుగుతుంది.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర పెళ్లి కూతురు శ్రీకవిత,ఆమె తల్లిదండ్రులు ఉషాకిరణ్ కుమార్-విజయలక్మీలకు పట్టు వస్త్రాలు బహుకరించారు.