ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో కలిసి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి నివాసానికి

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో కలిసి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి నివాసానికి

IMG 20241113 WA0078 scaled

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావుతో కలిసి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు కొండంత అండగా ఉంటామని భరోసానిచ్చారు.నగరంలోని కేబీఆర్ పార్కులో బుధవారం ఉదయం వాకింగ్ చేస్తున్న నరేందర్ రెడ్డిని మఫ్టీలో పోలీసులు బలవంతంగా తమ వెంట తీసుకువెళ్లిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఫిలిం నగర్ రోడ్డు నంబర్ 7లో ఉన్న నరేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన తల్లి రుక్కమ్మ, సతీమణి శృతి, కుటుంబ సభ్యులను కలిశారు.నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కేటీఆర్ మాట్లాడుతూ,పోలీసులు నరేందర్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి బలవంతంగా తీసుకెళ్లిన దృష్ట్యా భయపడొద్దని, ఆందోళన చెందవద్దని పార్టీ కొండంత అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు.అటు తర్వాత నరేందర్ రెడ్డి నివాసం వద్ద గుమిగూడిన మీడియా ప్రతినిధులతో కేటీఆర్ మాట్లాడారు.ఈ సందర్భంగా కేటీఆర్ వెంట ఎంపీ రవిచంద్ర,మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now