ఎంపీ వద్దిరాజు తెలంగాణ భవన్ లో కేటీఆర్ గతో కలిసి కాళోజీకి ఘన నివాళులు
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావుతో కలిసి దివంగత కాళోజీ నారాయణరావుకు ఘనంగా నివాళులర్పించారు.సుప్రసిద్ధ కవి, రచయిత కాళోజీ 22వ వర్థంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన చిత్రపటానికి ఎంపీ రవిచంద్ర మాజీ మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి,మాజీ ఎంపీలు బాల్క సుమన్,రావుల చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కే.ప్రభాకర్ తదితర ప్రముఖులతో కలిసి పూలుజల్లి శ్రద్ధాంజలి ఘటించారు.అలాగే,బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి,కోతి కిశోర్ గౌడ్,గెల్లు శ్రీనివాస్ యాదవ్,తుంగబాలు తదితరులు కాళోజీ చిత్రపటానికి పూలుజల్లారు.