కుటుంబ సర్వేను పర్యవేక్షించిన ఎంపీడీవో పుల్లయ్య

*సమగ్ర కుటుంబ సర్వేను పర్యవేక్షించిన ఎంపీడీవో పుల్లయ్య*

*ఇల్లందకుంట నవంబర్ 16 ప్రశ్న ఆయుధం*

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలను, కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల ఎంపీడీవో పుల్లయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మండలంలో పదివేల ఆరు వందల నలభై కుటుంబాలను గుర్తించామని, ఇట్టి సర్వే చేయడానికి 87 ఎనిమినేటర్సులతో సర్వే నిర్వహిస్తున్నామని శనివారం రోజు వరకు 50 శాతం పూర్తి చేశామని త్వరలో మిగతా 50 శాతం పూర్తి చేస్తామని అన్నారు, ముందుగా స్టిక్కరింగ్ వేయడంతో ప్రజలకు అవగాహన కల్పించామని, అవసరం ఉన్న సర్టిఫికెట్స్ ను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పడం జరిగిందని శనివారం రోజున సర్వే కు వెళ్లడంతో అందరూ మాకు సహకరిస్తున్నారు, కొంతమంది సరియైన సర్టిఫికెట్ చూపించాక ఎక్కువ సమయం పడుతుందని అన్నారు కొన్ని ప్రాంతాలలో సహకరించని వారితో నేను గాని ఎమ్మార్వో గాని వెళ్లి అక్కడి వారికి సర్ది చెప్పి ఈ కార్యక్రమాన్ని ముందుకు వెళ్లే విధంగా చూస్తున్నామన్నారు సర్వే చేస్తున్న ఎన్యుమెటర్లు వారి వద్దకు వెళ్లి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment