Site icon PRASHNA AYUDHAM

మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఎంపీడీవో. స్పెషల్ ఆఫీసర్ 

IMG 20240820 WA0085

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఎంపీడీవో సంతోష్ కుమార్. స్పెషల్ ఆఫీసర్ వారితో కలిసి పంచాయతీ సెక్రెటరీ నరేందర్ మధ్యాహ్న భోజనం పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీవో సంతోష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెను ప్రకారం అందించాలని మధ్యాహ్న భోజనంలో అవకతవకలు లేకుండా చూడాలని ప్రధానోపాధ్యాయులు లోకేశ్వర్ ను కోరారు విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించకపోతే చర్యలు తప్పవని ఆయన అన్నారు మధ్యాహ్న భోజన నిర్వాహకులు డబ్బులు రావడం లేదని ఎంపీడీవో సంతోష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన స్థానికంగా స్పందించి మధ్యాహ్న భోజనం డబ్బులు వచ్చే విధంగా చొరవ చూపుతానని ఆయన హామీ ఇచ్చారు మధ్యాహ్న భోజనం ఎలా వండుతున్నారు రుచిగా ఉంటుందో లేదో అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు రుచిగానే వండుతున్నారని మెను ప్రకారం వంట వండుతున్నారని విద్యార్థులు అన్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్స్ మరియు ఎం పిఓ సురేందర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి నరేందర్ ఏపీవో మధు ప్రధానోపాధ్యాయులు లోకేశ్వర్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Exit mobile version