ఎంపిడిఓ ల సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా మాచారెడ్డి ఎంపీడీవో
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
జిల్లా పరిషత్ కామారెడ్డి కార్యాలయం లో మంగళవారం ఎంపీడీవోల సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, జిల్లా పరిషత్ ఎన్నికల అధికారి బి చందర్ నాయక్ ఆధ్వర్యంలో తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం కామారెడ్డి జిల్లా 2025- 2027 సం.కొరకు కార్యవర్గ ఎన్నికలు నిర్వహించరు. ఎంపీడీవో ల సంఘం జిల్లా కార్యవర్గం ను జిల్లాలోని ఎంపిడిఓ లు సమావేశం అయి నూతన జిల్లా కార్యవర్గం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చందర్ నాయక్ తెలిపారు.అధ్యక్షులుగా మాచారెడ్డి మండల ఎంపీడీవో టీవీఎస్ గోపి బాబు, ప్రధాన కార్యదర్శిగా ఎం సంతోష్ కుమార్ ఎంపీడీవో సదాశినగర్ , కోశాధికారిగా శ్రీ ఎల్ రాజేశ్వర్ ఎంపీడీవో గాంధారి,
ఉపాధ్యక్షులుగా రాణి ఎంపీడీవో మద్నూర్,
జాయింట్ సెక్రటరీగా కమలాకర్ ఎంపీడీవో పిట్లం,
ఎగ్జిక్యూటివ్ మెంబర్ లు గా సయ్యద్ సాజిద్ అలీ, ఎంపీడీవో తాడ్వాయి, నాగవర్ధన్ ఎంపీడీవో కామారెడ్డి, శ్రీనివాస్ ఎంపీడీవో జుక్కల్ తదితరులుఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి చందర్ నాయక్ ధ్రువి కరణ పత్రాలను అందజేశారు.