రేపు రాష్ట్రవ్యాప్త నిరసనకు ఎంఆర్పీఎస్ పిలుపు..!!

రేపు రాష్ట్రవ్యాప్త నిరసనకు ఎంఆర్పీఎస్ పిలుపు..!!

IMG 20241008 WA0072

రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండానే 11 వేల టీచర్ పోస్టుల భర్తీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్నదని విమర్శించారు.మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన ఆయన..ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రేపు అన్ని జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహా నుంచి కలెక్టరేట్ల వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టాలని పిలుపునిచ్చారు. కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ నుంచి బషీర్ బాగ్ వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. తేనె పూసినట్లుగా తియ్యటి మాటలు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆచరణలో మాత్రం మాదిగలకు నమ్మద్రోహం చేస్తున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెబితే ఈ తీర్పు వచ్చిన అరగంటలోనే రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఈ దేశంలోనే అందరికంటే ముందే తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారని కానీ మాలల ఒత్తిడితో నమ్మకద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.

Join WhatsApp

Join Now