ముడా ఛైర్మన్ రాజీనామా
Oct 16, 2024,
ముడా ఛైర్మన్ రాజీనామా
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యపై విచారణ కొనసాగుతున్న తరుణంలో ముడా అథారిటీ ఛైర్మన్ కె.మరిగౌడ రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత నెలలో కూడా ఆయన కారులో బెంగళూరుకు వెళ్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.