బురదమయమైన రహదారి వాహనదారుల ఇబ్బందులు
ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 26(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
శివ్వంపేట మండలం అల్లీపూర్ తండాకు వెళ్లే రహదారి బురద మయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో రోడ్డు బురదమయంగా మారి నడుచుకుంటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన తమ తండా రోడ్డు దుస్థితి మాత్రం మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రోడ్డు మరమ్మతు చేయాలని కోరుతున్నారు.