Site icon PRASHNA AYUDHAM

42% బీసీ రిజర్వేషన్ కోసం ముదిరాజ్ మహాసభ పూర్తి మద్దతు

IMG 20251017 WA0036

బీసీ రిజర్వేషన్లకు ముదిరాజ్ మహాసభ మద్దతు – బంద్‌ను విజయవంతం చేద్దాం: బట్టు విఠల్

42% బీసీ రిజర్వేషన్ కోసం ముదిరాజ్ మహాసభ పూర్తి మద్దతు

జిల్లాలో ప్రతి మండలం, గ్రామం బంద్‌లో పాల్గొనాలని పిలుపు

బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో అక్టోబర్ 18న రాష్ట్రవ్యాప్త బంద్

ముదిరాజ్ నాయకులు ఏకతాటిపైకి రావాలని సూచన

వాణిజ్య, వ్యాపార సంస్థలు, సబ్బండ వర్గాల మద్దతు కోరింపు

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 17

కామారెడ్డి జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బట్టు విఠల్ ముదిరాజ్ బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన కోసం జరుగుతున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ముదిరాజ్ నాయకులు ఐక్యంగా బంద్ కార్యక్రమంలో పాల్గొని బీసీల శక్తిని ప్రదర్శించాలని విఠల్ ముదిరాజ్ కోరారు.

జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు సహా మండల స్థాయి నాయకులు అధ్యక్షుడి ఆదేశాల మేరకు బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు.

బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో అక్టోబర్ 18న జరగబోయే తెలంగాణ రాష్ట్ర బంద్‌కు ముదిరాజ్ మహాసభ పూర్తి మద్దతు ప్రకటిస్తూ, ప్రతి బీసీ కుల నాయకుడు, యువకుడు ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇట్టి బంద్ విజయవంతం కావడానికి వ్యాపార, వాణిజ్య సంస్థలు, సబ్బండ వర్గాల ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని బట్టు విఠల్ ముదిరాజ్ కోరారు.

Exit mobile version