పెద్ద కొడప్గల్ లో ఏకగ్రీవంగా ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

పెద్ద కొడప్గల్ లో ఏకగ్రీవంగా ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

కామారెడ్డి జిల్లా జుక్కల్ ఆర్సీ (ప్రశ్నఆయుధం)అక్టోబర్ 12

పెద్ద కొడప్గల్ గ్రామ ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఆదివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశం ముదిరాజ్ సంఘం భవనంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కౌలాస్ సంజీవ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగింది.

నూతనంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులు:

అధ్యక్షుడు: గొర్రె రాములు

ఉపాధ్యక్షుడు: బొమ్మల నాగులు,కారడి సాయిలు

ప్రధాన కార్యదర్శి: మాడు జ్ఞానేశ్వర్

కోశాధికారి: జక్కల శంకర్

ఈ సందర్భంగా కౌలాస్ సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ,.. “ముదిరాజ్ బంధువులందరూ పార్టీలకతీతంగా ఐక్యతగా ఉండాలి. మన హక్కుల కోసం సమష్టిగా పోరాటం చేయాలి. ముదిరాజ్ సామాజిక వర్గం అన్ని రంగాల్లో ముందుకు సాగాలి. ‘మనమెంతో, మనకంత’ అనే నినాదంతో రాజ్యాధికారంలో వాటా కోసం కృషి చేయాలి,” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశంగా ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ డి గ్రూప్‌ నుండి బీసీ ఏ గ్రూప్‌ లోకి తరలించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, అందులో భాగంగా సంఘం సభ్యులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.జై ముదిరాజ్,జై పెద్దమ్మతల్లి,ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి…అని నినాదాలు చేశారు.ఈ సమావేశంలో జుక్కల్ నియోజకవర్గ ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు మాడు మహేష్, మండల ముదిరాజ్ సంఘం నాయకులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment