*ముదిరాజ్ వర్గ హక్కుల కోసం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పణ*
ఎల్లారెడ్డి, సెప్టెంబర్12 (ప్రశ్న ఆయుధం):
ఎల్లారెడ్డి మండల ముదిరాజ్ మహాసభ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో పార్థసింహారెడ్డికి వినతిపత్రం సమర్పించి, ముదిరాజ్ వర్గానికి తక్షణ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో అధిక జనాభా కలిగిన ముదిరాజ్ వర్గం రాజకీయ, ఆర్థిక పరంగా వెనుకబడింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ మరియు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ముదిరాజులను బీసీ–డి నుండి బీసీ–ఏ లోకి మార్చాలి, కానీ జి.ఓ. నెం.15 జారీ అయినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదని సంఘం కార్యవర్గ నాయకులు విమర్శించారు. మండల అధ్యక్షులు ప్యాలాల రాములు మాట్లాడుతూ, ముదిరాజ్ వర్గం శతాబ్దాలుగా రిక్షా కార్మికులు, కూలీలు, చిన్న వృత్తులపై ఆధారపడి ఆత్మగౌరవ జీవితం గడుపుతున్నప్పటికీ సరైన గుర్తింపు లేకపోవడం అన్యాయం అని పేర్కొన్నారు. ఇక వాగ్దానాలు కాదు అమలు కావాలనీ ముదిరాజుల ఐక్యతే మన బలం అని ముదిరాజ్ బందువులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పండగ సాయన్న ముదిరాజ్, కేవల్ కిషన్ ముదిరాజ్, పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ వంటి మహనీయులు వెలిసారు. వారు సమాజానికి చేసిన సేవలు మరువలేనివి. అలాంటి వర్గానికి హక్కులు ఇవ్వకపోవడం అన్యాయం అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ప్యాలాల రాములు, ఉపాధ్యక్షులు నీల సిద్దిరాములు, బోనగిరి ఎల్లయ్య, గాదె బలయ్య, జక్కుల అశోక్, జనరల్ సెక్రటరీ గొనె శ్రీకాంత్, మండల కమిటీ యూత్ అధ్యక్షుడు కిరణ్ తేజ, ఉపాధ్యక్షులు నీల రవి, జనుముల పోచయ్య, బత్తుల రాములు, కార్యవర్గ సభ్యుడు నిజ్జన మహేందర్, కన్నెబోయిన రాజు, ముదిరాజ్ సంఘ సభ్యులు మర్రి బాలకిషన్, బైండ్ల హనుమంతు, ఇసాయిపేట కాశీరాం తదితరులు పాల్గొన్నారు.