కప్ప భాస్కర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
గజ్వేల్, 12 జనవరి 2025 : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు క్యాసారం లో కాంగ్రెస్ యువనేత కప్ప భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసిన పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు, పిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాసారం గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు తిలకించడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన కప్ప భాస్కర్ కు అభినందనలు తెలిపారు. ముగ్గుల పోటీలో భాగంగా మొదటి బహుమతి కప్ప అనూష, రెండవ బహుమతి పంజాల కీర్తన, మూడవ బహుమతి పంజాల మమత లకు బహుమతులు అందజేయడం చాలా సంతోషం ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహన్నగారి రాజు, మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, తిగుల్ గ్రామ మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ రావు, రాజశేఖర్ రెడ్డి, సమీర్, కృపానందం, ప్రేమ్ కుమార్, సయ్యద్ బాబా, మామిడి కృష్ణ, కరుణాకర్, అభిషేక్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, ధార అశోక్, కొండల్ రెడ్డి, మల్లేష్ గౌడ్, కొండల్ గౌడ్, చంద్రశేఖర్, దండు స్వామి, కప్ప మహేష్, చాకలి మహేష్, సుధాకర్ రెడ్డి,క ప్ప యాదగిరి, కప్ప శంకర్, ఎరుకల ఆంజనేయులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.