*ముక్కోటి ఏకాదశి.. రాజన్న ఆలయంలో విశిష్ఠ పూజలు*
వేములవాడ డిసెంబర్ 10
హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉ. మంగళ వాయిద్యాలు, సుప్రభాతం, ఆలయం శుద్ధి చేసి ప్రాతఃకాల పూజ నిర్వహించారు. ఉ. 5.10 గంటలకు స్వామివారి పల్లకి సేవ ద్వారా ఉత్తర ద్వారం ప్రవేశం చేసి పెద్ద సేవపై అధిరోహణ చేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ అనంతరం రాజగోపురం ముందు ఏకాదశి విశిష్ఠత ప్రవచనాలు నిర్వహించారు.