సంగారెడ్డి ప్రతినిధి, డిసెంబరు 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): వార్షిక తనిఖీలలో భాగంగా శనివారం నాడు సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని మల్టీ జోన్-II ఐజీ సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ పుష్ప గుచ్చం అందజేశారు. అనంతరం ఐజీ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో గౌరవ వందనం స్వీకరించారు. సిబ్బందికి టర్న్ అవుట్ మరియు మాబ్రిల్ డ్రిల్, వెపన్ డ్రిల్ తనిఖీ చేశారు. అనంతరం ఆర్ముడ్ రిజర్వ్ కార్యాలయంలో ఆ విధంగా రికార్డులను, ఆయుధగారాన్ని తనిఖీ చేశారు. మోటార్ వెహికల్ సెక్షన్ లో ఇన్స్పెక్షన్ చేస్తూ ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వెహికల్ కండిషన్, రికార్డు మెయింటెనెన్స్ తదితర అంశాల గురించి తనఖీ చేశారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలోని అడ్మిన్ విభాగంలో వివిధ సెక్షన్లలో పని చేసిన సిబ్బందితో ఐజీ మాట్లాడుతూ.. సిబ్బంది బిల్స్ ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని, పోలీస్ సిబ్బంది 24 * 7 విధులలో బిజీగా ఉంటారని, వారికి రావాల్సిన ఇంక్రిమెంట్స్, సరెండర్ లీవ్స్, రివార్డులు, అవార్డులు, సర్వీస్ బుక్ మెయింటెనెన్స్ వంటి విషయాలను గుర్తు చేయాల్సిన బాధ్యత అడ్మిన్ విభాగము సిబ్బందిగా మీపై ఎంతగానో ఉందని పై విషయాలను అడ్మిన్ విభాగం అధికారి ఏవో ఇ.కళ్యాణి మానిటర్ చేస్తూ సిబ్బంది యొక్క వెల్ఫేర్ చూడాలన్నారు. అనంతరం యస్.బి, డి.సి.ఆర్.బి సెక్షన్లను తనిఖీ చేస్తూ రికార్డులను పరిశీలించారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన విధులను పూర్తి నిబద్ధతతో నిర్వహించాలని ఏ రికార్డు కూడా పెండెన్సీ లేకుండా ప్రతి ఒక్క రికార్డును అప్డేట్ చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా యస్.హెచ్.ఓ.లకు వివిధ క్రైమ్ లలో సలహాలు సూచనలు అందించాలని అన్నారు. ఎస్.బి, డి.సి.ఆర్.బి అనేవి జిల్లా పోలీస్ శాఖకు ప్రధాన మైనవని, వివిధ కేసులలో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా ఇన్వెస్టిగేషన్ అధికారులకు సలహాలు సూచనలు ఇవ్వాలని గుర్తు చేశారు. అదేవిధంగా జిల్లాలో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా క్షేత్ర స్థాయిలో నిఘా ఉంచాలన్నారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ… జిల్లాలు వేరైనప్పటి నుండి సంగారెడ్డి జిల్లాలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ జిల్లా యంత్రాంగం అంతా క్రైమ్ డిటెక్షన్, లా అండ్ ఆర్డర్ విషయాలలో, మాదకద్రవ్యాల నిర్మూలన, ట్రాఫిక్ సమస్యను నియంత్రించడం వివిధ బందోబస్తులలో పూర్తిస్థాయిలో విధులు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ పెరిగినప్పటికీ సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ అవలంబిస్తున్న వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు, ప్రజల వెల్ఫేర్ కొరకు చేపట్టిన కార్యక్రమాలు అభినందనీయం అన్నారు. జిల్లా ఎస్పీ రూపేష్ ప్రత్యేక చొరవతో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి కొత్తగా ట్రాఫిక్ ఈ బైక్స్ ను ప్రారంభించడం జరిగిందని, అదేవిధంగా ఎక్కువ ట్రాఫిక్ సమస్యలు ఉన్న ప్రాంతంలో ట్రాఫిక్ డైవర్షన్స్, కొన్ని యూటర్న్స్ ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రధానంగా రహదారులైన రెండు నేషనల్ హైవేలు ఉన్నాయని, ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మాదకద్రవ్యాల నిర్మూలనకు ఎస్- నబ్ ను ఏర్పాటు చేసి సత్:ఫలితాలు రాబట్టడం జరుగుతుందన్నారు. జిల్లా పోలీసుల పనితీరును అభినందించారు. అదేవిధంగా డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఎలాంటి అల్లర్లు గొడవలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. యువత మద్యం సేవించి, డ్రంకెన్ కండిషన్లో వాహనాలు నడపడం, పార్టీలలో డీజేలు ఏర్పాటు చేయడం నిషేధమని, జిల్లా, రాష్త్ర వ్యాప్తంగా 30,30a పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని, జిల్లా పోలీస్ శాఖకు సహకరించవలసిందిగా జిల్లా ప్రజలను కోరడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి అడ్మిన్ ఎ. సంజీవ రావ్, డిటీసీ అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావ్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ. కళ్యాణి, డీఎస్పీలు సత్యయ్య గౌడ్, రవీందర్ రెడ్డి, రాంమోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి జిల్లా ఇన్స్పెక్టర్, ఆర్.ఐలు తదితరులు ఉన్నారు.