ముంబై వలసజీవులారా తెలంగాణలోని కుల జనగణనలో
తెలంగాణ గ్రామాల నుంచి పొట్టకూటి కోసం ముంబైకి వెళ్ళిన అశేష వలసజీవుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. ఒక కాలు ముంబైలో ఉంటే మరొక కాలు తన స్వగ్రామంలో ఉంటాయనేది తెల్సిందే. అయితే తమ యథార్థ జీవిత పరిస్థితి ప్రభుత్వపరంగా నమోదు కావాలని, గ్రామాలకు తరలి వెళ్ళాలని ముంబైలోని ప్రఖ్యాత అదానీ కంపనీ డైనమిక్ కార్మిక నేత సిరిపంగి రవీందర్, ముంబై తెలంగాణ బహుజన ఫోరం (ఎటిబిఎఫ్) కన్వీనర్ సి.ఎచ్ గణేష్ ముదిరాజ్ లు తమ ముంబై ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన ఇంటింటికి కుల జనగణన సర్వే ఇటీవల ప్రారంభమైంది. సర్వేలో మొత్తం 75ప్రశ్నలు ఉంటాయని, వీటి నుంచి సమాచారం సేకరిస్తారని, భూమి వివరాలు సేకరించే క్రమంలో ధరణి పట్టా నెంబరు, మెట్ట, తరి, పడావు వంటి భూమి రకం, ఎకరాలు గుంటల రూపంలో ఎన్యుమరేటర్లకు చెప్పాల్సి ఉంటుందని ఆయన ముంబైకర్లకు తెలియజేశారు. ఇంతేగాకుండా తమ ఓ/బీసీ ఎస్సీ ఎస్టీల జాతి వివరాలు స్పష్టంగా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ముంబైకర్లరా ఇట్టి ప్రభుత్వపు సర్వేలో పాల్గొని సులువుగా వివరాలు అందించి తమ అస్తిత్వాన్ని చాటండని రవీందర్, గణేష్ లు ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు.