*తెలంగాణ నికార్సైన ఉద్యమకారుల సదస్సులో ముంబైకర్లు*
ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 20: హైదరాబాద్‌లోని సుందరయ్య సైన్స్ సెంటర్‌లో తెలంగాణ ఉద్యమకార్ల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రామగిరి ప్రకాష్ చారి, గొల్లపల్లి నాగరాజు ల అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. ఎంఎల్‌సి ప్రొఫెసర్ కోదండరామ్, సీపీఎం నేత డి.జె నర్సింగరావు, ప్రోగ్రెసివ్ మహిళ సంస్థ సంధ్యక్క అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొ. కోదండరాం మాట్లాడుతూ ఐకాస సమన్వయ కమిటీ చేసిన డిమాండ్లు న్యాయమైన వేనని సమర్థించారు. అనేక అడ్డంకులను ఎదుర్కొని స్వరాష్ట్రాన్ని సాధించడానికి బాధ్యత వహించిన కార్యకర్తల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని రాష్ట్ర సర్కారును కోరారు. తెలంగాణ ఒక వ్యక్తితో రాలేదని, ప్రజా ఉద్యమం ద్వారానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. త్యాగాలతో సాధించిన తెలంగాణ “ఉద్యమ జ్ఞాపకాల ఫెస్టివల్” జరుపుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు. ముఖ్యంగా ఉద్యమ కార్యకర్తలకు కనీసం గుర్తింపు కార్డులు, స్వతంత్ర సమరయోధుల వలె ప్రయాణ సౌకర్యాలు, 250 గజాల ఇంటి స్థలం, ఆరోగ్యపరమైన హెల్త్ కార్డులు, పెన్షన్ ఇవ్వాలని సభ ముఖాన సమన్వయకర్తలు కోరారు. జూన్ 2నాటికి “సంక్షేమ కమిటీ” ని ప్రకటించకపోతే బిక్షాటన నిరసన తెల్పాల్సి వస్తుందని ఈ మేరకు వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ముంబై నుంచి తెలంగాణ ఉద్యమకారులైన ఎంటీబిఎఫ్ నేతలు సి.ఎచ్ గణేష్ ముదిరాజ్, మంగిలిపెల్లి శ్రీనివాస్ బెస్త లుపాల్గొనడం విశేషం. ఉద్యమ నేత్రీ సోయారా బేగం, ప్రముఖులైన తెలంగాణ వెంకన్న, ముత్తయ్య యాదవ్, బండి వెంకటేష్, లాలయ్య, బి. మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.