*ప్రొఫెసర్ కోదండరాంను సత్కరించిన ముంబైకర్లు*
ప్రశ్న ఆయుధం మార్చి 25:
తెలంగాణ జేఏసీ నేత, ఉద్యమకారుడు, నూతనంగా ఎమ్మెల్సీగా ఎంపిక ఐన ప్రొఫెసర్ కోదండరాం సార్ ను హైదరాబాద్లోని తార్నాక నివాసానికి వెళ్లి ముంబైకర్లు ఘనంగా సన్మానించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోదండరాం సార్ కు ఎమ్మెల్సీ పదవి బహుకరించిన విషయం తెల్సిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అయితే సోమవారం ఉదయం ముంబై నుంచి విచ్చేసిన మాల మహానాడు మహారాష్ట్ర అధ్యక్షులు బత్తుల లింగం చేతుల మీదుగా కోదండరాం సార్ కు ముంబైకి చెందిన భవ్య శాల్వా కప్పి, పుష్ప గుచ్ఛం ఇచ్చి సత్కరించారు. ఇందులో సంఘం పదాధికారులైన లక్మ కైలాస్, కొండూరు గంగాధర్ వీరితో పాటు స్థానిక మండల కోటేశ్వర్ రావు, తాజా మాజీ కౌన్సిలర్ ఆర్.కె.నగర్, బర్రె రాజకుమార్ కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ ఆర్.కె నగర్ తాజా మాజీ కౌన్సిలర్ మండల కోటేశ్వర్ రావు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.