అద్దంకి దయాకర్ కు శుభాకాంక్షలు తెల్పిన ముంబైకర్లు

*అద్దంకి దయాకర్ కు శుభాకాంక్షలు తెల్పిన ముంబైకర్లు*

ప్రశ్న ఆయుధం మార్చి: 23 ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ అంబేద్కర్ వాది, క్రియాశీల కాంగ్రెస్ నాయకులు డాక్టర్ అద్దంకి దయాకర్ ని ముంబై నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన మహారాష్ట్ర మాల మహానాడు నాయకులు మర్యాద పూర్వకంగా కలశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని గ్రీన్ పార్క్ హోటల్లో ప్రత్యక్షంగా భేటీ ఇచ్చి పుష్ప గుచ్చం శాల్వాతో మాల మహానాడు మహారాష్ట్ర అధ్యక్షులు బత్తుల లింగం సత్కరించారు. వీరితో సహా మహానాడు పదాధికారులైన మాణిక్యం, లక్మ కైలాస్, కొండూరు గంగాధర్, దేవతి జనార్ధన్, మూగ ప్రభాకర్, బత్తుల మధుకర్, దేవతి కిరణ్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now