ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్ సి 24
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ సూచన మేరకు మునగ పంటనే సాగు చేయాలని మండలంలోని రైతుల అందరితో చర్చించి సుమారు 55 ఎకరాల పంటను రైతులతో ఏర్పాటు చేయించి. మండల పరిధిలోని ముష్టిమండ,ఆసన్నగూడెం మల్కారం, దమ్మపేట గ్రామాలలో వేసిన మునగ పంటను మండల వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించి తగు జాగ్రత్తలు చేశారు. పురాతన కాలం నుంచి మునగ పంటకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుందని. ఈ క్రమంలో రైతులందరూ మునగ పంటపై దృష్టి సారించాలని లాభసాటిగా రైతుకు న్యాయం జరగాలని, మొక్క నాటిన నుంచి 7 నుంచి 8 నెలల వరకు కాయలు కాచే దశకు చేరుకుంటుందని అన్నారు. ఎండాకాలంలో బీడు భూములు వదిలేయకుండా మునగ పంటను రైతులందరూ సాగు చేయాలని, ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలియజేశారు.
ప్రత్యామ్నాయ పంటగా మునగనే సాగు చేయాలి
by Naddi Sai
Published On: December 24, 2024 9:29 pm