24వ వార్డులోని నూతన బోర్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి

24వ వార్డులోని నూతన బోర్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి

ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి 13.

సోమవారం కామారెడ్డి పట్టణంలోని 24వ,వార్డులో నీటి సమస్య ఉంది అని కౌన్సిలర్ చైర్ పర్సన్ దృష్టికి తీసుకురావడం వల్ల వెంటనే ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సహకారంతో బోర్ వేయించడం జరిగింది. సమస్య తీర్చడానికి మున్సిపల్ చైర్మన్ కొబ్బరి కాయ కొట్టి బోర్ ప్రారంభించడం జరిగింది.అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ… చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణాన్ని కాపాడిన వారిమౌతామన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుందున ప్రతి ఒక్కరు ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రతను పాటించాలని పరిసరాలు నీటిగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోని,వార్డు కౌన్సిలర్, ఇల్లందుల లతా వేణు, కాలనీవాసులు, పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now