Headlines
-
జన్మదిన వేడుకలకు కార్మికుల సమక్షంలో ఛైర్ పర్సన్
-
మున్సిపల్ కార్మికుల సంక్షేమంపై గడ్డం ఇందు ప్రియ
-
కార్మికులతో కలిసి జన్మదినం జరుపుకున్న నాయకురాలు
-
పరిశుభ్రతలో కార్మికుల పాత్రపై ఛైర్ పర్సన్ వ్యాఖ్యలు
-
కార్మికుల సంతోషమే నా ప్రాధాన్యం – గడ్డం ఇందు ప్రియ
ప్రశ్న ఆయుధం, నవంబర్ 23, కామారెడ్డి :
కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ చంద్రశేఖర్ రెడ్డి తన జన్మదిన వేడుకలను శనివారం మున్సిపల్ కార్మికుల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను కార్మికుల మధ్య కార్మికులతో పాటు కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందని, తాను కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కార్మికులు కృషి చేయాలని అన్నారు. అనంతరం మున్సిపల్ కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రాజనర్సు మాట్లాడుతూ కార్మికులకు ఏ చిన్న సమస్య వచ్చినా ఛైర్ పర్సన్ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తూ ఆర్థిక సహాయాన్ని సైతం అందిస్తూ తమ కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నారన్నారు. పేదల ప్రజల కోసం కష్టపడుతూ పేద ప్రజల మధ్య ఉండే ఇలాంటి నాయకురాలు ముందు ముందు మరిన్ని పదవులు పొంది పేదలకు సాయం చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు అనుష ప్రసన్న, పాత శివ కృష్ణమూర్తి, పంపరి లతా శ్రీనివాస్, లడ్డు మొయినుద్దీన్, సలీం, అంజద్, మున్సిపల్ కార్మిక నాయకులు ప్రభు, ప్రభాకర్ మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్టయ్యింది