యోగ సీఎం కప్ జిల్లా స్థాయి పోటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్
– గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి
ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 19:
కామారెడ్డి పట్టణంలోని గురువారం యోగ కేంద్రంలోని ఏర్పాటు చేసిన యోగ సీఎం క్లబ్ జిల్లా స్థాయి పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, క్రీడాకారులకు మా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని చెప్పడం జరిగింది. అలాగే,యోగా సంస్కృతం అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం.ఇది అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది. దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు. వీరు సాధారణ సంఘ ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది.