స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 28, కామారెడ్డి :

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలి సూచన మేరకు స్వచ్ఛత హి కార్యక్రమంలో శనివారం కామారెడ్డి పరిధిలోగల 32 వార్డులోని పబ్లిక్ టాయిలెట్ ను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి మాస్ క్లీనింగ్ డ్రైవ్ లో భాగంగా పబ్లిక్ టాయిలెట్ ను శుభ్రం చేశారు. స్వతహాగా పబ్లిక్ టాయిలెట్ క్లీన్ చేసి, పబ్లిక్ టాయిలెట్ బయట ఆవరణంలో, చుట్టుపక్కల శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డు కౌన్సిలర్ అనూష, మాధురి ప్రసన్న కుమార్, పాత శివ కృష్ణమూర్తి, చాట్ల రాజేశ్వర్, తయబ సుల్తానా సలీం, వనిత రామ్మోహన్, మానసా సురేష్, సానిటరీ ఎస్సై పర్వేజ్, మోమిన్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now