*మొక్కలు నాటిన మున్సిపల్ ఛైర్ పర్సన్*
ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగస్టు 09, కామారెడ్డి :
కామారెడ్డి పరిధిలోని 4, 5 వ వార్డ్ లలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందూ ప్రియ చంద్రశేఖర్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. మానవ మనుగడకు మొక్కలు జీవనాధారమని, ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలను నాటాలని పేర్కొన్నారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతని, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డు కౌన్సిలర్ లడ్డు ఇమ్రాన్ మోయినుద్దీన్, పాత శివ కృష్ణ, చాట్ల వంశీ, కృష్ణమూర్తి, పిడుగు మమత సాయిబాబా, స్పెషల్ ఆఫీసర్ రమ్య, అంగన్వాడి టీచర్ సుజాత, సునీత, ఏఎన్ఎం పద్మ, ఆశ వర్కర్లు శిరీష, సౌమ్య, ఆర్పీలు మౌనిక, మాధవి, రాజేశ్వరి, ఆస్మా, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు