Site icon PRASHNA AYUDHAM

నీటి సమస్యను తీర్చిన మున్సిపల్ ఛైర్ పర్సన్ 

IMG 20240828 WA0435

నీటి సమస్యను తీర్చిన మున్సిపల్ ఛైర్ పర్సన్ 

ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగష్టు 28, కామారెడ్డి :

కామారెడ్డి పట్టణంలోని 47వ వార్డులో ప్రజలు కొన్ని నెలలనుండి నీటి సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని  కౌన్సిలర్ చైర్ పర్సన్ దృష్టికి తీసుకురావడంతో నీటి సమస్య తీర్చడానికి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం కొబ్బరి కాయ కొట్టి నూతన బోర్ వేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీటిని పొదుపుగా వాడుకోవాలని, చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతని పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలని అన్నారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుందున ప్రతి ఒక్కరు ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రతను పాటించాలని పరిసరాలు నీటిగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డ్ కౌన్సిలర్  గేరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ, పాత శివ కృష్ణమూర్తి, పంపరి లతా శ్రీనివాస్, చాట్ల వంశీ, పిడుగు మమతా సాయిబాబా, నజీరుద్దీన్, పిట్ల వేణు, మాజీ కౌన్సిలర్ జూలూరి సుధాకర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version