*సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన*
*మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్*
*జమ్మికుంట జూలై 11 ప్రశ్న ఆయుధం*
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ అన్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగివుండాలని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ సంఘ సభ్యులకు సూచించారు. శుక్రవారం 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు సమావేశంలో కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ అర్పిలు, సంఘ సభ్యులతో ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే అనే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరు నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని టైర్ ల మధ్యలో, కొబ్బరి బొండాలలో, కూలర్ లలో నీరు నిల్వ ఉన్న చోట నీరును తొలగించి శుభ్ర పర్చాలని నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో దోమలు వృద్ధి చెంది, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం అధికంగా ఉందన్నారు. ఈ విషయంపై అర్పిలు విధిగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం రైల్వే స్టేషన్ పరిధిలో స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్ పెక్టర్ మహేష్, సదానందం, సి.ఎల్.అర్పి మంజుల, శానిటరీ జవాన్లు, అర్పిలు, పలువురు పాల్గొన్నారు.