Site icon PRASHNA AYUDHAM

వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన మునిసిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్

IMG 20250806 220220

వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన మునిసిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్

జమ్మికుంట ఆగస్టు 6 ప్రశ్న ఆయుధం

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మునిసిపాలిటి పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ, అంబేద్కర్ కాలనీలలో ముంపు ప్రాంతాలను బుధవారం మునిసిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ గతంలో హౌసింగ్ బోర్డు కాలనీ కి చెందిన తుడి రవిచందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హౌసింగ్ బోర్డు కాలనీ లో నాలాపై అక్రమంగా కబ్జా చేసిన వారికి టౌన్ ప్లానింగ్ అధికారులచే నోటిసులు జారి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కబ్జా చేసిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం జమ్మికుంట మునిసిపాలిటి పరిధిలో వినాయక నిమజనం పనులను బుధవారం మునిసిపల్ కమీషనర్ మహమ్మద్ ఆయాజ్ పరిశీలించారు. రానున్న వినయక నిమజ్జనానికి అవసరమగు క్రేన్లను వెళ్ళే దారులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, ఏఈ లు నరేష్, వికాస్, టౌన్ ప్లానింగ్ అధికారులు శ్రీధర్, దీపిక, సానిటరీ ఇన్స్ పెక్టర్ మహేష్, సదానందంలతో పాటు పలువురు పాల్గొన్నారు.

Exit mobile version