ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్..

ప్రశ్న ఆయుధం జులై22

కీసరకీసర రెవెన్యూ పరిధిలోని బండ్లగూడలో రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ గత కొంతకాలంగా ఓ స్థలం విషయంలో ఏఎస్పి సుదర్శన్ మధ్య వివాదం నడుస్తుంది.సుదర్శన్ స్థలాన్ని రిటైర్డ్ ఏఎస్పి సత్యనారాయణ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి ఆక్రమించాడు.ఆ గోడను కూల్చివేసేందుకు కమిషనర్ రాజలింగయ్య టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ ప్రసాద్ లను బాధితుడు సుదర్శన్ ఆశ్రయించగా లక్ష రూపాయలు డిమాండ్ చేయగా 50 వేలకు ఒప్పందం కుదుర్చుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించిన సుదర్శన్ అనే బాధితుడు నుంచి 50వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఎస్ రాజలింగయ్య ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.గత నాలుగు నెలల నుండి కమిషనర్ రాజలింగయ్య టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ ప్రసాద్ లు తన స్థలాన్ని రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ ఆక్రమించి నిర్మించిన ప్రహరీ గోడను తొలగించడానికి డబ్బులు డిమాండ్ చేయడంతో విసిగిపోయిన బాధితుడు ఏసిపి అధికారులను ఆశ్రయించి మున్సిపల్ కమిషనర్ రాజ లింగయ్య ప్లానింగ్ అధికారి శ్రీధర్ ప్రసాద్ లను తన కార్యాలయంలోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు.

Screenshot 2024 07 22 20 58 55 76 40deb401b9ffe8e1df2f1cc5ba480b12

Join WhatsApp

Join Now