శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం..
నిజామాబాద్ జనవరి 17
నిజామాబాద్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం శనివారం నిర్వహించనున్నారు. నగర మేయర్ నీతూ కిరణ్ అధ్యక్షతన కమిషనర్ దిలీప్ కుమార్ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఇప్పటికే కార్పొరేటర్లకు సమాచారం అందజేశారు. ఈనెల 26తో పాలకవర్గం పదవీకాలం ముగియనుండడంతో ఇదే చివరి సమావేశం కానుంది.