సిసి రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి
మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని 11’వ వార్డులో మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి శుక్రవారం పర్యటించారు.ఈ సందర్భంగా వార్డులో నిర్మాణంలో ఉన్న సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి మాట్లాడుతూ… అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కాలయాపన చేయకుండా ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఇంజనీరింగ్ విభాగం ఏఈని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సంపత్ రెడ్డి , శ్రీధర్ రెడ్డి , మాజీ వార్డ్ మెంబర్ భాస్కర్ , స్థానిక మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.