కాంగ్రెస్ గూటికి చేరిన మున్సిపల్ కౌన్సిలర్లు
ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగస్టు 31 , కామారెడ్డి :
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ముదిరాజ్ పై అవిశ్వాసం పెట్టి పదవి నుండి తొలగించిన టిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు శనివారం హైదరాబాదులోని ఎమ్మెల్యే మదన్మోహన్ రావ్ నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో కౌన్సిలర్లు పద్మ శ్రీకాంత్, అల్లం శ్రీను, బాలామణి, భూదేవి, నీలకంఠంలు ఉన్నారు. వీరికి ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుర్మ సాయిబాబా, గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.